అక్షరటుడే, ఇందూరు: గణితం, సామాన్య శాస్త్రం సబ్జెక్టులపై శ్రద్ధ పెట్టాలని డీఈవో అశోక్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం నగరంలోని వెంగళరావు నగర్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. ఏ సబ్జెక్టు అయినా భయంతో కాకుండా ఇష్టంతో చదవాలన్నారు. ప్రధానంగా నిత్య సాధనతో ఏదైనా సులువుగా మారుతుందని సూచించారు. అనంతరం విద్యార్థులకు పాఠాలు బోధించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.