నలుగురు టీచర్లకు షోకాజ్ నోటీసులు

0

అక్షరటుడే, ఇందూరు: సమయానికి పాఠశాలకు హాజరు కాని నలుగురు ఉపాధ్యాయులకు డీఈవో అశోక్ షోకాజ్​ నోటీసులను అందజేశారు. గురువారం నగరంలోని వినాయక నగర్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఆ సమయంలో టీచర్లు రాకపోవడంతో నోటీసులు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాల సమయానికి ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. నోటీసులు అందుకున్న వారిలో పద్మావతి, భారతి, విజయశాంతి, కరుణ ఉన్నారు.