అక్షరటుడే, ఇందూరు : పదో తరగతి పరీక్షలకు సంబంధించి రుసుమును ఆన్లైన్ ఇంటిగ్రేషన్ ఏకీకరణ సైబర్ ట్రెజరీ ద్వారా మాత్రమే చెల్లించాలని డీఈవో అశోక్ తెలిపారు. ఫీజులు ఈనెల 11 లోపు చెల్లించాలని సూచించారు. రూ.50 అపరాధ రుసుముతో డిసెంబర్ 2 వరకు, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబర్ 21వ తేదీ వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు.