అక్షరటుడే, ఇందూరు: జిల్లాలోని ఆయా మండలాల ఎంఈవోలు శనివారం మధ్యాహ్న భోజనానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని డీఈవో అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలు 7న మహాసభలో పాల్గొంటున్నాయని, దీంతో ఆయా స్కూళ్లలో విద్యార్థుల భోజనానికి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.