అక్షరటుడే, ఇందూరు : డీఎస్సీ 2024 (ఎస్జీటీ, స్పెషల్ ఎడ్యుకేషన్) అభ్యర్థుల ధ్రువపత్రాలను మంగళవారం పరిశీలించనున్నట్లు డీఈవో దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా 1:3 లిస్ట్ ను డీఈవో కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. లిస్టులో ఉన్న అభ్యర్థులు మంగళవారం ఉదయం 10 గంటలకు కొత్త కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికెట్, రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని సూచించారు.