అక్షరటుడే, ఇందూరు: డీఎస్సీ ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 5వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. తమ మొబైల్ ఫోన్, ఈ-మెయిల్ కు వెరిఫికేషన్ సమాచారం వచ్చిన అభ్యర్థులు ఉదయం 10 నుంచి 5 గంటల్లోపు జిల్లా కేంద్రంలోని నిర్మల హృదయ పాఠశాలలో హాజరుకావాలని సూచించారు. ఒరిజినల్ సర్టిఫికెట్, గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరించిన రెండు జతల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని పేర్కొన్నారు.