అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, వరంగల్‌లో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రణాళిక చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా అందిస్తామన్నారు. అలాగే అన్ని జిల్లాలను కలుపుతూ రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మాణం చేపడుతామని తెలిపారు.