అక్షరటుడే, వెబ్​డెస్క్​: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నాలుగు కొత్త పథకాలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర్​రావు, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలానికో ఓ గ్రామంలో ఆదివారం పథకాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో అన్ని పథకాలను ఒక్కరోజులోనే పూర్తి చేస్తామని ప్రకటించారు. కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మార్చి వరకు అర్హులందరికీ పథకాలు వర్తింపజేస్తామన్నారు. సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా అందిస్తామని తెలిపారు. అనర్హులు పథకాలకు ఎంపికైనట్లు తమ దృష్టికి వస్తే క్యాన్సల్​ చేస్తామని చెప్పారు.