అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ దేవర మూవీ తాజాగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి చేరింది. విడుదలైనప్పటి నుంచి టాలీవుడ్‌, బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్ లోనూ పలు రికార్డులు సొంతం చేసుకున్న దేవర మూవీ 16 రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా సాధించింది. మూవీలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేశారు. జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటించింది. దేవర పార్ట్‌-2 కోసం ఎన్టీఆర్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు.