అక్షరటుడే, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ రాధాకృష్ణన్ ప్రభుత్వ ఏర్పాటుకు ఫడ్నవీస్‌ను ఆహ్వానించారు. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. కాగా మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తారా? లేదా? అనేది ఇంకా స్పష్టత రాలేదు.