అక్షరటుడే, వెబ్ డెస్క్: శబరిమలలో అయ్యప్ప దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం వేలాది మంది స్వాములు స్వామి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. అయ్యప్ప స్వామి దర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఈ రోజు, రేపు భక్తులను పరిమితంగా దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు టీడీబీ ప్రకటించింది. ఈ రోజు అయ్యప్ప స్వామికి థంక అంకి ఉత్సవంగా తీసుకుని వచ్చిన నగలతో అలంకరిస్తారు. గురువారం వార్షిక మండల పూజకు సర్వం సిద్ధం చేశారు. అయ్యప్ప శరణుఘోషతో శబరిమల పరిసరాలు ప్రతిధ్వనిస్తున్నాయి. క్యూ లైన్లు కిలోమీటర్ల మేర భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి.