అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇక్కడి త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రజలు ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల కోసం యూపీ సర్కార్‌ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన స్పేస్‌ వ్యూ చిత్రాలను ఇస్రో విడుదల చేసింది.