అక్షరటుడే, బోధన్: వసంత పంచమిని పురస్కరించుకుని సరస్వతి మాల వేసుకున్న భక్తులు బాన్సువాడ నుంచి బాసరకు పాదయాత్రగా బయలుదేరారు. భక్తులు శనివారం ఉదయం బయలుదేరి ఈరోజు ఉదయం 3 గంటలకు వరకు బోధన్ కు చేరుకున్నారు. సోమవారం ఉదయం కల్లా బాసరకు చేరుకుంటామని భక్తులు తెలిపారు.