అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డిలో గుట్టుగా సాగుతున్న వ్యభిచార గృహంపై దేవునిపల్లి పోలీసులు దాడి చేశారు. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. దేవునిపల్లి గ్రామంలోని విద్యుత్ నగర్ లో వ్యభిచారం నడుస్తుందని నమ్మదగిన సమాచారం మేరకు ఓ ఇంటిలో సోదాలు చేపట్టారు. ఒక మహిళ, ఒక పురుషుడు కలిసి ఈ దందా నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. సోదాల్లో ముగ్గురు విటులు, ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.