అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు ధరణి పోర్టల్ సేవలు నిలిచిపోనున్నాయి. డేటాబేస్ వెర్షన్ అప్‌గ్రేడ్ కారణంగా పోర్టల్ సేవలు బంద్ కానున్నాయి. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం వరకు పోర్టల్ సేవలు అందుబాటులో ఉండవని అధికారులు ప్రకటించారు. దీంతో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడనుంది.