పరీక్షల నిర్వహణలో సీఎస్‌డీవోలు కీలకం

0

అక్షరటుడే, ఇందూరు: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల నిర్వహణలో చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు కీలకమని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి, పరీక్షల నిర్వహణ కన్వీనర్‌ రఘురాజ్‌ అన్నారు. గురువారం నిజామాబాద్‌ ప్రభుత్వ బాలుర(ఖిల్లా) జూనియర్‌ కళాశాలలో అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురాజ్‌ మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నియమ నిబంధనల ప్రకారమే ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కమిటీని సంప్రదించాలన్నారు. ఉదయం 9 గంటల తర్వాత సెంటర్లలోకి విద్యార్థులను అనుమతించరాదని ఆదేశించారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులుగా రవి కుమార్‌, రజియుద్దీన్‌ అస్లం, దేవారాంను నియమించారు. కార్యక్రమంలో బాలుర కళాశాల ప్రిన్సిపల్‌ యాకినుద్దీన్‌, హైపవర్‌ కమిటీ డాక్టర్‌ చిరంజీవి, చిన్నయ్య, ప్రభుత్వ అధ్యాపకుల సంఘాల నాయకులు నర్సయ్య, లక్ష్మీనారాయణ, భాస్కర్‌ పాల్గొన్నారు.