అక్షరటుడే, ఇందూరు: జూనియర్ కళాశాలల్లో చదువులో వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఇంటర్ విద్యాధికారి రవికుమార్ ఆదేశించారు. శనివారం జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు 90 రోజుల ప్రణాళికను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే సిలబస్ పూర్తి చేసినందున ల్యాబ్ లలో ప్రయోగాలను చేయించాలని చెప్పారు.