అక్షరటుడే, ఆర్మూర్: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన దినేష్ కులాచారిని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్ ఆధ్వర్యంలో బుధవారం సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి గంగోనె సంతోష్, ఆర్మూర్ నియోజక ఇన్ఛార్జి పాలెపు రాజు, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా నాయకులు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.