అక్షరటుడే, నిజామాబాద్ రూరల్ : ఎస్సీ వర్గీకరణ చేశాకే టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఎంఎస్ఎఫ్ తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడు దినేశ్ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన తర్వాతే ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తర్వాత మాట మార్చారన్నారు. దీనిని ఖండిస్తూ ఈనెల 9న జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తామన్నారు.