అక్షరటుడే, వెబ్‌డెస్క్: భారత్ – కెనడా దౌత్యసంబంధాలు పూర్తిగా సన్నగిల్లాయి. నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందంటూ ట్రుడో సర్కార్ చేసిన ఆరోపణలు.. ఇరు దేశాలకు మధ్య అగాధాన్ని పెంచాయి. ఇప్పటికే ఆరోపణలు.. ప్రతి ఆరోపణలతో గొడవలు కొనసాగుతున్నాయి. తాజాగా భారతీయ విద్యార్థులకు కెనడా స్టూడెంట్ వీసా పథకాన్ని నిలిపివేసింది. ఇది భారతీయ విద్యార్థులకు తీవ్ర అవరోధం కానుంది. ప్రస్తుతం తమ దేశ హౌసింగ్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోందని, వనరుల కొరత కూడా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొస్తోంది. ఆ దేశంలోకి వలసలు విపరీతంగా పెరిగిపోవడమే కారణంగా అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి.