అక్షరటుడే, వెబ్‌డెస్క్: రష్యా, ఉక్రెయిన్ అంబాసిడర్లతో సహా 73 దేశాల దౌత్యవేత్తలు ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో స్నానమాచరించనున్నారు. ఫిబ్రవరి 1న వీరు రానున్నారని కుంభమేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ తెలిపారు. అమెరికా, జపాన్, జర్మనీ, నెదర్లాండ్స్, ఉక్రెయిన్, కెమెరూన్, కెనడా, స్వీడన్, పోలెండ్, స్విట్జర్లాండ్, బొలివియా తదితర దేశాల దౌత్యవేత్తలు రానున్నట్లు చెప్పారు. ఈ మేరకు యూపీ సీఎస్ కు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ లేఖ పంపింది. వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించింది.