అక్షరటుడే, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని ఢిల్లీవాలా స్వీట్ హోంలో డిషెస్ క్లీన్ చేసే స్క్రబ్బర్ తీగలు కనిపించాయి. పట్టణానికి చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి అరకిలో కాజు కథ్లీ స్వీట్ తీసుకున్నాడు. ఇంటికి వెళ్లి చూడగా స్వీట్లో స్క్రబ్బర్ తీగలు బయటపడ్డాయి. పిల్లలు చూసుకోకుండా తిని ఉంటే పరిస్థితి ఏమిటని వాపోయాడు. నిర్లక్ష్యంగా స్వీట్స్ విక్రయిస్తున్న ఢిల్లీ వాలా స్వీట్ హోంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరాడు.