అక్షరటుడే, కోటగిరి: మండల కేంద్రంలోని కేజీబీవీ, ఎస్సీ హాస్టల్, మైనార్టీ జూనియర్ కళాశాలను జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. కళాశాలలోని సదుపాయాలను పరిశీలించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి మంచి భోజనం అందిస్తున్నారని అడిగారు. కళాశాలలో బోధన, తరగతుల తీరుపై ఆరా తీశారు. ఆయన వెంట ఎమ్మార్వో గంగాధర్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంఈవో శ్రీనివాస్ రావు, ఎంపీవో చందర్ ఉన్నారు.