అక్షరటుడే, ఇందూరు: ప్రముఖ ప్రజాకవి వరంగల్ శ్రీనివాస్ రచించిన ‘నూరేండ్ల నా ఊరు’ గేయ కావ్యం పాడేందుకు గాయనీగాయకులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా కళాకారుడు అష్ట గంగాధర్ తెలిపారు. శనివారం కేర్ డిగ్రీ కళాశాలలో విలేకరులతో మాట్లాడారు. ఎంపిక ప్రక్రియ నగరంలోని కొత్త అంబేడ్కర్ భవన్ లో ఈ నెల 30న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఆసక్తి గల గాయకులు పాల్గొనాలని కోరారు. సమావేశంలో రేలారే రేలా గంగా, నరాల సుధాకర్, రాంపూర్ సాయి, సాయి లవోలా, క్రాంతి, సవిత, దివ్య, మహేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.