అక్షరటుడే, ఎల్లారెడ్డి: పదో తరగతి విద్యార్థులు భయపడకుండా పరీక్షలు రాయాలని జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్​ఎం బలరాం అన్నారు. ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలనే విషయమై విద్యార్థులకు 24 పేజీల బుక్​లెట్​ ఇచ్చామన్నారు. ఈసారి పదో తరగతి మెమోలలో పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ముద్రిస్తారని తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లింగమూర్తి, కృష్ణారెడ్డి, రామకృష్ణ, దేవదాస్, మాధవి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.