అక్షరటుడే, వెబ్ డెస్క్: హైదరాబాద్ కు చెందిన లస్సనియా స్కేటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. మొయినాబాద్ లో నిర్వహించిన 13వ ఎస్ ప్రో ట్విన్ సిటీస్ రోలర్ రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీల్లో వివిధ జిల్లాల నుంచి 800 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా నుంచి 30 మంది పతకాలు సాధించారు. వీరిలో 8 మందికి బంగారు, 12 మందికి రజత, 10 మందికి కాంస్య పతకాలు గెలుచుకున్నారు. క్రీడాకారులను రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రామచందర్ అభినందించారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, సిమ్మింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మహిపాల్, యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్, వాలీబాల్ కోచ్ సాయిలు, తదితరులున్నారు.