అక్షరటుడే, ఇందూరు: లసానియా స్కేటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 16, 17న హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు పలు పతకాలు సాధించినట్లు జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామ్ చందర్ తెలిపారు. 8 మంది బంగారు, 12 మంది రజత, 10 మంది కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. క్రీడాకారులను అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి మహిపాల్, యోగా అసోసియేషన్ కార్యదర్శి గంగాధర్, వాలీబాల్ అసోసియేషన్ కోచ్ సాయిలు, స్కేటింగ్ కోచ్ లో గణేష్ శంకర్ తదితరులు అభినందించారు.