అక్షరటుడే, కోటగిరి: రుద్రూర్ మండలం సులేమాన్ ఫారంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల సర్వేను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీ కార్యదర్శి ఇతర సిబ్బంది నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించారు. సర్వే చేసే వివరాలను పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా తప్పులు దొర్లకుండా సర్వే పూర్తి చేయాలన్నారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ,రుద్రూర్ తహసీల్దార్ తారాబాయి, ఎంపీడీవో సురేష్ బాబు పాల్గొన్నారు.