అక్షరటుడే, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లాలో 12 మంది పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి షోకాజ్ నోటీసులిచ్చారు. జనరల్ ఫండ్స్ ఆగం చేశారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు పక్కనబెట్టి రాజకీయాలు ఎక్కువ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇంటి పన్నులు వసూలు చేసి చలాన్ కట్టకుండా లక్షల్లో నిధులు దుర్వినియోగం చేశారని కార్యదర్శులపై మండిపడ్డారు. నల్లగొండ జిల్లా మొత్తం ఇదే తంతు అంటూ తన దగ్గర ఉన్న ఆధారాలను అధికారులకు చూపించారు. కాగా.. కలెక్టర్ తీసుకున్న చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి.