అక్షరటుడే, బోధన్: గణితంపై విద్యార్థుల్లో నెలకొన్న భయం పోగొట్టాలని జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ సూచించారు. అభ్యాసం ద్వారా గణితాన్ని సులువుగా నేర్పించవచ్చని అన్నారు. ఎడపల్లి మండలం ఏఆర్పి క్యాంప్ ఉన్నత పాఠశాలలో జిల్లాలోని గణిత ఉపాధ్యాయులకు బుధవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి టి సాయిలు తదితరులు పాల్గొన్నారు.