అక్షరటుడే, ఇందూరు: జిల్లాలోని నిరుద్యోగులకు ఈనెల 29న ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. పేటీఎం, చార్ భాయ్ బీడీ వర్క్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్, డ్రైవర్స్, అటెండర్, హౌస్ కీపర్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని.. ఆసక్తి గల అభ్యర్థులు శివాజీ నగర్​లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.