అక్షరటుడే, ఇందూరు: మానవ శరీరంలో నేత్రాలు ప్రధాన అవయవమని, వాటి పరిరక్షణ ఎంతో అవసరమని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. మంగళవారం నిజామాబాద్ బార్ అసోసియేషన్, డాక్టర్ అగర్వాల్ ఆస్పత్రి సంయుక్తంగా కోర్టులో కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. మనిషి మరణానంతరం చేసే నేత్రాల దానమే.. గొప్ప దానమన్నారు. బార్ అసోసియేషన్ కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, డాక్టర్ శరత్ జోషి, డాక్టర్ చరణ్ గౌడ్, గణేష్, సంజయ్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాజు, పీపీ రాజేశ్వర్రెడ్డి, ఇన్చార్జి గవర్నమెంట్ ప్లీడర్ వెంకటరమణ గౌడ్, న్యాయవాదులు కవితరెడ్డి, లక్ష్మణ్, అంజలి, రజిత, తదితరులు పాల్గొన్నారు.