అక్షరటుడే, ఇందూరు: విద్యార్థులకు కుష్టు లక్షణాలు ఉంటే వైద్యులకు సమాచారం ఇవ్వాలని జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ భార్గవి అన్నారు. బుధవారం బోర్గాం(పి) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లెప్రసీ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శరీరంపై రాగి రంగు మచ్చలు ఏర్పడితే భయపడకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఎంవో శ్రీనివాస్, టీబీ కో-ఆర్డినేటర్ రవి, డాక్టర్ సంతోష్, పాఠశాల హెడ్​మాస్టర్​ శంకర్​, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.