అక్షరటుడే, బోధన్: గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి పేర్కొన్నారు. బోధన్ పట్టణంలోని గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శరత్‌రెడ్డి, గ్రంథపాలకుడు శ్రావణ్, సందీప్, రమాదేవి, కాంగ్రెస్ నాయకులు నవీన్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.