అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి పేర్కొన్నారు. భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సోమవారం ఐకేపీ సెంటర్లకు ఎలక్ట్రానిక్ కాంటాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాత రాజు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఇలియాస్, అనంతరెడ్డి, సుతారి రమేశ్, నరసింహారెడ్డి, భూమా గౌడ్, తదితరులున్నారు.