అక్షరటుడే, బాన్సువాడ: ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో ఎంసెట్ , నీట్, జేఈఈ కోసం విద్యార్థులను సిద్ధం చేస్తుండడం హర్షణీయమని జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం అన్నారు. బీర్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులను అడిగి శిక్షణ తీరును తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు.