అక్షరటుడే, ఇందూరు: జిల్లాలో నకిలీ క్రీడా సంఘాలను దూరం పెట్టాలని జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య సూచించారు. ఒలింపిక్ సంఘం నుంచి అఫిలియేషన్ తీసుకున్న సంఘాలకు గురువారం గుర్తింపు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని క్రీడా సంఘాలు తమ పూట గడుపుకునేందుకు జాతీయ, అంతర్జాతీయ సర్టిఫికెట్లు అందజేస్తూ మోసం చేస్తున్నాయన్నారు. కావున విద్యార్థులు, క్రీడాకారులు గమనించి గుర్తింపు పొందిన సంఘాల్లోనే టోర్నమెంట్లను ఆడాలని సూచించారు. అనంతరం జిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి మనోజ్ కు ఒలింపిక్ సభ్యత్వాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం కార్యదర్శి భూమారెడ్డి, రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.