అక్షరటుడే, ఇందూరు: బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జనవరి 5న సావిత్రిబాయి పూలే పురస్కారాలను అందజేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కరపత్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణ, అసోసియేటెడ్ అధ్యక్షుడు మోహన్, గౌరవాధ్యక్షుడు కైరంకొండ బాబు, ఉపాధ్యక్షులు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.