అక్షరటుడే,కామారెడ్డి టౌన్: అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి అర్హులైన ఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి రజిత తెలిపారు. ఈనెల 29 వరకు గడువును పొడిగించామన్నారు. పేద ఎస్సీ విద్యార్థులు విదేశాలలో చదువుకునేందుకు ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుందన్నారు. విద్యార్థులు GRE/GMAT, టోఫెల్, IELTS అర్హత సాధించడంతో పాటు డిగ్రీలో 60 శాతం మార్కులు ఉండాలన్నారు. కుటుంబ ఆదాయం ఐదు లక్షలకు మించి ఉండరాదన్నారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.