అక్షరటుడే, ఇందూరు: రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో గెలుపొంది దక్షిణ భారత స్థాయి పోటీలకు జిల్లా విద్యార్థులు ఎంపికయ్యారు. వారిని శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అభినందించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కాగా.. పోటీలు ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు పాండిచ్చేరిలో జరగనున్నాయి. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి గంగకిషన్, అసిస్టెంట్ కమిషనర్ విజయభాస్కర్, పీఆర్టియూ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎంపికైన విద్యార్థులు
అంకిత (రెంజర్ల, జెడ్పీహెచ్ఎస్), నవదీప్ సాయి (కంజర, జెడ్పీహెచ్ఎస్), విజితేంద్రియ (విజయ్ పాఠశాల), శివమణి (మాణిక్ భవన్), గోవర్ధన్ (సుద్ధపల్లి జెడ్పీహెచ్ఎస్).