అక్షరటుడే, ఇందూరు: నేషనల్స్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో డిచ్ పల్లి ఏడో బెటాలియన్ రిజర్వ్ ఇన్ స్పెక్టర్ సవీన్ లాంగ్ జంప్ లో బంగారు పతకం సాధించారు. అలాగే 100 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. దీంతో త్వరలో జరగబోయే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.