అక్షరటుడే, కామారెడ్డి: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌ నగర్‌ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సోమవారం కామారెడ్డికి రానున్నారు. ఉదయం 11 గంటలకు బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ సభ్యులతో సమావేశం ఉంటుందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. అలాగే 12.30 గంటలకు జిల్లా గ్రంథాలయంలో పట్టభద్రులతో మాట్లాడతారని పేర్కొన్నారు.