అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాకు కొత్తగా ఏడు 108 అంబులెన్సులు మంజూరయ్యాయని డీఎంహెచ్‌వో రాజశ్రీ తెలిపారు. వీటిని ధర్పల్లి, ఇందల్‌వాయి, జక్రాన్‌పల్లి, రుద్రూర్‌, ఎడపల్లి, పోతంగల్‌, సాలూర మండలాలకు కేటాయించినట్లు పేర్కొన్నారు.