అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో గరిష్టంగా 303 పాయింట్లు, నిఫ్టీ 87 పాయింట్లు నష్టపోయాయి. ఆ తర్వాత మార్కెట్లు కోలుకున్నాయి. ఉదయం 12:30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 350 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్ రంగాల షేర్లు లాభాల బాటలో ఉండగా ఎనర్జీ, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో సెక్టార్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. నిఫ్టీ 50లో టాటా కన్స్యూమర్, హెచ్యూఎల్, బ్రిటానియా, ఐచర్ మోటార్స్, గ్రాసిం, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, విప్రో, జేఎస్ డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ ఒక శాతానికి పైగా లాభంతో ఉండగా.. డాక్టర్ రెడ్డీస్, అపోలో హాస్పిటల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్ ఒక శాతానికి పైగా నష్టపోతున్న స్టాక్స్ జాబితాలో ఉన్నాయి.