అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: భారత్ కు చెందిన దొమ్మరాజు గుకేశ్‌ ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి సంచలనం సృష్టించారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ డిరగ్‌ లిరెన్‌ (చైనా)తో గురువారం 14వ రౌండ్‌లో జరిగిన తుదిపోరులో విజేతగా నిలిచారు. ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ అయిన అతిపిన్న వయస్కుడిగా గుకేశ్‌ రికార్డు సృష్టించారు. 18 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనతను అందుకున్నారు. కాగా, గుకేశ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు.