Donald Trump : ప్ర‌తీకార సుంకాలు.. భార‌త్‌, చైనాల‌పై ట్రంప్ ఎంత సుంకాలు ప్ర‌క‌టించాడంటే..!

Donald Trump : ప్ర‌తీకార సుంకాలు.. భార‌త్‌, చైనాల‌పై ట్రంప్ ఎంత సుంకాలు ప్ర‌క‌టించాడంటే..!
Donald Trump : ప్ర‌తీకార సుంకాలు.. భార‌త్‌, చైనాల‌పై ట్రంప్ ఎంత సుంకాలు ప్ర‌క‌టించాడంటే..!

అక్షర టుడే, వెబ్ డెస్క్ Donald Trump : అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ (Donald Trump)అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి కొత్త నిర్ణ‌యాలు తీసుకుంటూ అంద‌రిని హ‌డలెత్తించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ముందు చెప్పిన‌ట్టుగానే ఆయ‌న పలు దేశాల పై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అర్థరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. వైట్‌ హౌస్‌ లోని రోజ్‌ గార్డెన్‌ లో నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ లో ట్రంప్‌ లిబరేషన్‌ డే గా నిర్వహించి ఏఏ దేశాల ఉత్పత్తులపై ఎంత శాతం సుంకాలు విధిస్తున్నామనే విషయాలను(Donald Trump Tariff) ట్రంప్ వెల్లడించారు. యూఎస్ మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా ఈరోజు గుర్తుండబోతుందని (Donald Trump) ట్రంప్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement

Donald Trump : సుంకాలు ఇలా..

సుంకాల ప్రకటనతో అమెరికాలో (America) మళ్లీ పెద్దెత్తున ఉద్యోగాలు వస్తాయి. కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయి. విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుస్తాం. అమెరికాలో పోటీతత్వం పెరిగి సరసమైన ధరల్లో వస్తువుల లభిస్తాయి.. ఫలితంగా అమెరికా స్వర్ణయుగమవుతుందని ట్రంప్ (Donald Trump) అన్నారు. భారతదేశంపై తాము 26శాతం సుంకాలు విధిస్తున్నట్లు తెలిపారు. తనకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి (Prime Minister Narendra Modi) గొప్ప స్నేహం ఉంది. అయితే, భారత్ అమెరికాతో సరైనవిధంగా వ్యవహరించడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ఉత్పత్తులపై 52శాతం సుంకాలు విధిస్తోందని, అందుకే భారత్ దేశంపైనా ప్రతీకార సుంకాలు విధిచక తప్పలేదని ట్రంప్ పేర్కొన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Sixth Great Planetary Alliance | షష్ఠ మహా గ్రహ కూటమి.. ముందు రోజే ఏమిటీ మహా ప్రళయం?

మరోవైపు భారత్ (India) పోరుగు దేశాలైన చైనాపై 34శాతం, పాకిస్థాన్ PAkistan 29శాతం, శ్రీలంక 44శాతం, బంగ్లాదేశ్ 37శాతం ప్రతీకార సుంకాలను ట్రంప్ (Donald Trump) విధించారు. యూఎస్ కు దిగుమతి అయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా ప్రతీకార సుంకాలు చూస్తే.. భారత్‌: 26 శాతం, చైనా: 34 శాతం, ఐరోపా యూనియర్: 20 శాతం, తైవాన్‌: 32 శాతం, జపాన్‌: 24 శాతం, దక్షిణ కొరియా: 25 శాతం, థాయిలాండ్‌: 36 శాతం, స్విట్జర్లాండ్‌: 31 శాతం, ఇండోనేషియా: 32 శాతం, మలేషియా: 24 శాతం, కాంబోడియా: 49 శాతం, యూకే: 10 శాతం, దక్షిణాఫ్రికా: 30 శాతం, బ్రెజిల్‌: 10 శాతం, బంగ్లాదేశ్‌ 37 శాతం, సింగపూర్‌: 10 శాతం, ఇజ్రాయెల్: 17 శాతం, ఫిలిఫ్ఫీన్స్‌: 17 శాతం, చిలీ: 10 శాతం, ఆస్ట్రేలియా: 10 శాతం, పాకిస్థాన్‌: 29 శాతం, టర్కీ: 10 శాతం, శ్రీలంక: 44 శాతం, కొలంబియా: 10 శాతంగా నిర్ణ‌యించారు.

Advertisement