Donald Trump : భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కిన డొనాల్డ్ ట్రంప్

Donald Trump : భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కిన డొనాల్డ్ ట్రంప్
Donald Trump : భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కిన డొనాల్డ్ ట్రంప్
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Donald Trump : యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్​పై తనకున్న అక్కసును వెళ్లదీసుకున్నారు. మరోసారి భారత్​పై కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్ నుంచి భారత్​కు ఇంపోర్ట్ చేసుకునే వస్తువులపై భారత్ అత్యధికంగా పన్ను విధిస్తోందని ఫస్ట్ నుంచి ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే కదా.

మరోసారి అదే విషయంపై వైట్ హౌస్​లో వ్యాఖ్యలు చేశారు ట్రంప్. భారత్ ఇష్టమున్నట్టుగా టారిఫ్​ను పెంచుతోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దాన్ని మేమే బట్టబయలు చేశామని అన్నారు. భారత్ అత్యధిక టారిఫ్ విధానాన్ని తామే బట్టబయలు చేశామని, దీంతో భారత్ దిగి వచ్చి పన్నులు తగ్గించేందుకు ఒప్పుకుందని ట్రంప్ అన్నారు.

Donald Trump : అందుకే మేము కూడా టారిఫ్ పెంచాం

భారత్ అత్యధిక పన్ను వసూలు చేయడం వల్ల తాము కూడా ఆ దేశంపై టారిఫ్​ను పెంచాల్సి వచ్చిందని ప్రెస్ మీట్​లో ట్రంప్ వెల్లడించారు. అందుకే.. ఇప్పుడు భారత్ టారిఫ్​ను తగ్గించేందుకు ముందుకు వచ్చిందని ట్రంప్ తెలిపారు.

ఇది కూడా చ‌ద‌వండి :  H4 Visa | ట్రంప్​ ఎఫెక్ట్​.. భారతీయుల్లో ఆందోళన

అయితే.. భారత్​తో పాటు కెనడా, మెక్సికో, చైనా లాంటి దేశాలపై ట్రంప్ కొత్త టారిఫ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇది ఏప్రిల్ 2 నుంచి అమలులోకి రానుంది. దీని వల్ల ఇండియాపై ఏడాదికి కనీసం ఏడు బిలియన్ డాలర్ల భారం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి భారత్ విధించిన టారిఫ్​పై ఇలా తన అక్కసును వెళ్లగక్కారు.

Advertisement