అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుకున్న రూ.12 కోట్లకు పైగా విలువ గల నిషేధిత పదార్థాలను దహనం చేసినట్లు డీపీఈవో మల్లారెడ్డి తెలిపారు. 154 కేసుల్లో పట్టుకున్న అల్ప్రాజోలం, డైజోఫాం, గంజాయిని జక్రాన్​పల్లిలో ఉన్న మెడికేర్​ యూనిట్​లో దహనం చేసినట్లు ఆయన చెప్పారు.