అక్షరటుడే, వెబ్​డెస్క్​: వైద్యురాలు​ నదిలో కొట్టుకుపోయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. హైదరాబాద్​కు చెందిన డాక్టర్​ అనన్యరావు తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. కర్ణాటకలోని కొప్పల్​ జిల్లాలోని తుంగభద్ర నదిలో ఈత కొట్టడానికి దిగింది. ఈ క్రమంలో వరద ప్రవాహంలో ఆమె కొట్టుకుపోయింది. దీంతో పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది వైద్యురాలి కోసం గాలిస్తున్నారు.