అక్షరటుడే, కామారెడ్డి: తనకు ఓటు వేసి గెలిపిస్తే నిజాయితీగా పనిచేసి చూపిస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి డా. మహమ్మద్ ముస్తాక్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ల సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎవరు గెలిచినా గ్రాడ్యుయేట్లకు న్యాయం జరగడం లేదన్నారు. రోజురోజుకూ నిరుద్యోగుల శాతం పెరిగిపోతుందన్నారు. తనలాంటి యువ నాయకునికి అవకాశం ఇవ్వాలని, పార్టీలకు అతీతంగా గెలిపించాలని కోరారు. 90 నుంచి 120 రోజుల్లో అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తానని, లేకపోతే 121వ రోజు రాజీనామా చేస్తానని పేర్కొన్నారు.